చలాచలబోధ సాంప్రదాయ గురువుల కృపతో ఏర్పడిన ఆశ్రమముల ద్వారా సత్సంగములు,
పుస్తక ప్రచురణ, వెబ్సైట్ నిర్వహణ, జూమ్ మాధ్యమ నిర్వహణ వంటి కార్యక్రమములు లాభాపేక్ష లేకుండా ఉచితంగా దాతలు
అందించు విరాళములతో అందించబడుచున్నవి. ఈ ద్రవ్య యజ్ఞంలో పాల్గొని వితరణ చేయగోరు
దాతలు ఈక్రింద ఇవ్వబడిన ఆశ్రమముల బ్యాంక్ అకౌంటులకు చెల్లింప మనవి. ద్రవ్య వితరణ
తదుపరి విరాళము/దాత వివరములు మానేజింగ్ ట్రస్టీ గారికి పంపిన మీ విరాళమును
ధృవీకరించి తగు రసీదును అందించెదరు.
మనందరమూ వితరణ చేసే ద్రవ్య యజ్ఞం
సద్వినియోగము చేయబడుతుంది. సాంప్రదాయముగా సనాతనధర్మం రోజువారీ దైనందిన జీవనములో
ఆచరించవలసిన ఐదు యజ్ఞాలు – దేవ, ఋషి, పితృ, మనుష్య, భూత యజ్ఞాలు. చలాచలబోధ సాంప్రదాయమున పరమాత్మచే
భగవద్గీత యందు చెప్పబడిన సాధనపూర్వకమైన పంచయజ్ఞాలకు
(జపయజ్ఞం, తపోయజ్ఞం , స్వాధ్యాయయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, జ్ఞానయజ్ఞం) ప్రాధాన్యత ఇవ్వబడింది. కొందఱు ద్రవ్యసంబంధ యజ్ఞములను మరికొందరు
తపోరూపయజ్ఞములను, కొందఱు
యోగరూపయజ్ఞములను చేయుదురు. మరికొందరు స్వాధ్యాయ యజ్ఞములను జ్ఞానయజ్ఞములను
ఆచరించుచున్నారు. కావున వీటియందు యధాశక్తి పాల్గొనగలరని మనవి.
ధన్యవాదాలు
- విద్యాసాగర్ స్వామి
KCBM
Trust, Bengaluru, Karnataka, India
KCBM
Trust, Hyderabad, Telangana, India
ద్రవ్య యజ్ఞం తదుపరి వితరణ వివరములు ఈక్రింద ఫామ్ ద్వారా అందించండి: