వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురుపరంపరాం
ముందుగా :
నిర్భయానంద స్వామి
మేకా నరసింహారావు గారిచే గత 44 సం।।లుగా
బోధించబడుతూ వారిశిష్యులు అమెరికా - వైజాగ్ - హైదరాబాద్ - తిరుపతి - విజయవాడ -
బెంగుళూరు మరియు ఇతర ప్రదేశములలో షుమారుగా 500 మంది వరకూ
అద్వైత - అచల సిద్దాంతములను విచారణ చేయుచూ జ్ఞానపూర్వక జీవనము జీవించుచున్నారు.
మనవి:
కైవల్యమార్గము
నూతనము - నవీనము కాదు. సనాతనము. సనాత్సనాతనము. సృష్ట్యాదినుండి నేటి వరకూ
పారంపర్యమై జ్ఞానప్రబోధకమై సర్వులకు శ్రేయోమార్గమును అందించుచున్నది.
కైవల్యమార్గమును
పరమాత్మ సూర్యునకు సూర్యుడు ప్రజాపతులకు ప్రజాపతులు మహర్షులకు పారంపర్యముగా
విహితరీతిన అందించినారు.
ప్రతీకాత్మకత
ద్వారా ద్వైతబుద్ధిని మరలించి అభేద అనన్య అద్వయ స్థితిని అందించే తాత్వికత కొరకు
దేవాలయనిర్మాణం జరిగింది.
కాలాంతరమున పరిశోధన
- విచారణ - విజ్ఞానము - వివేకము గురుకులాలకు తరలింది.
విజ్ఞాన పరిశోధనా
ఫలములనందించుటలో అత్రి, వ్యాస, వశిష్ఠ,యాజ్ఞావల్క్య, శుక , సాందీప,
కృష్ణ, ఉద్ధవ పారంపర్యమున పరతత్వ
నిర్ణయమందించబడినది.
నారద, భారద్వాజ, జమదగ్ని, ఆంగీరస, కశ్యప, గోవింద
భగవత్పాద, శంకర భగవత్పాద తచ్ఛిష్య పారంపర్యము మహావాక్య
నిర్ణయమున పరబ్రహ్మ లక్ష్యముగా తత్వమునందించినారు.
నేటి కాలములో
సరియైన పరిశోధన - తత్వవిచారణ - పరాత్పర నిర్ణయము ఎడల భిన్నమైన అభిప్రాయములు
వ్యక్తమై సమన్వయము కొరవడి పీఠపారంపర్యములు పండిత పామర జనరంజకత్వమునే ప్రాధాన్యముగా
స్వీకరించి కర్మకాండకు 70% భక్తి లేక ఉపాసనలకు 20% జ్ఞానమునకు 10% ప్రాధాన్యతను ఇచ్చు రీతిగా
సమాజమునందు కనపడుచున్నది.
ఈతరుణమున
నిర్భయానంద స్వామి అద్వైత - అచలాశ్రమ పద్ధతులను గమనించి చలాచలబోధ సాంప్రదాయము
సామాన్యులకు - సాధకులకు శ్రేయోదాయకమని అభిలషించినారు. అవతార్ మెహర్ బాబా మౌనముగా
అందించిన బోధనలను - అరవిందుని దివ్యజీవనము, పూర్ణయోగమును
- రామకృష్ణ పరమహంస బోధనలను - సాంప్రదాయిక యోగ వాశిష్ఠ - జ్ఞాన వాశిష్ఠ -
బృహద్వాశిష్ఠములను - కందార్ధములను దర్శనరీతిగా అందుకొన్నవారై తరించినారు. పరమగురు
పరమేష్ఠి గురు కరుణచే కడతేరినారు. స్వయం అయినారు.
స్వయముగా ప్రణాళిక
యందు సద్గురువుగా అవకాశము వచ్చిననూ తూష్ణీభూతముగా ఉన్నారు.
ఈ క్రమంలో వారికి
భగవాన్ సత్యసాయి కృపచే ఒకరు, గణపతి
సచ్చిదానందుల వలన ఒకరు, మెహెర్ బాబా వలన ఒకరు మొత్తము
ముగ్గురు శిష్యపరమాణువులు లభించినారు.
·
అప్పటినుండి ( 1997) నేటివరకూ అనేక ప్రాంతములందు వారినాశ్రయించిన పారంపర్యము
వ్యక్తముగా చాలామంది సంప్రదించుచుండుట వలన
·
వారు 93 సం।।ల వారగుటవలన అనేక ప్రదేశములకు ప్రయాణము చేయలేని
పరిస్థితులున్నందున
·
వారినాశ్రయించిన
శిష్య పరమాణువులు శ్రద్ధాళువులకు ఉపదేశములిచ్చుచు గురుపూర్ణిమ - మాఘపూర్ణిమ వంటి
కార్యక్రమములను గత 12 సం।।లుగా అనేక చోట్ల
నిర్వహించబడుటయును
·
ఇప్పటికే
బోధాధికారము గలవారు 20 మందివరకూ ఉండుటయును
·
ఆశ్రయించి
అనుసరించువారిప్పటికి 500 మంది వరకూ ఉండుట వలనను
·
గతంలో పలుమార్లు
వేరే ప్రాంతములనుండి వచ్చిన వారు కొలదిరోజులుండి సాధన - విచారణ - నిర్ణయము
పొందుటకు తగిన వసతి - భోజన సౌకర్యములు లేకపోవుట వలన ఎక్కువమంది వారి ఆశీస్సులు -
శిక్షణ - కృప అందుకోలేక పోవుటవలన
·
చలాచలబోధ
పారంపర్యమును స్థిరీకరించి భావి తరాలకందించుటకు ఒక కేంద్ర స్థానముండవలెనని
·
ఇప్పటికే గత 44 సం।।లుగా బోధించబడిన ఆడియో - వీడియో - గ్రంథరాజములను
పరిరక్షించు వ్యవస్థ అవసరమైనందున
·
సర్వం శూన్యం -
శూన్యం సర్వము అను నిర్ణయమునిచ్చు అవతారుని సమాధి స్థానమువలె భవిష్యత్ తరాలకు మార్గదర్శనము
కావించు స్థానముండవలసినందున
చలాచలబోధోపదేశ మందిరము ప్రతిపాదితమై అమెరికా లోని ఆస్టిన్ నందు వశించు చైతన్య అను
పిల్లవానికి 15 లక్షల విరాళమివ్వవలెననే స్ఫూర్తి
కలుగుటను ఈశ్వర సంకల్పముగా భావించి సమిష్టి కృషితో పూర్తిచేయ సంకల్పించబడినది.
లక్ష్యము: చలాచలబోధ ద్వారా సనాతన ధర్మ ప్రబోధం - కేవల జ్ఞాన ప్రబోధ - పరిపూర్ణ
నిర్ణయము.
చేపట్టిన
కార్యక్రమములు:
·
సాధకులచే
చతుస్సంధ్యలలో జప - ధ్యాన - అధ్యయన - విచారణ - బోధా కార్యక్రమములను ఆచరింపచేయుట
·
ప్రతి నెల పౌర్ణమి
సత్సంగములు - రెండురోజుల బోధ - అద్వైత - అచల సిద్ధాంతములను సమన్వయ పరచి
జ్ఞానమార్గమును - కైవల్యమార్గమును తెలియచేసి సదాచారముతో జీవింపజేయుట.
·
మహాశివరాత్రి
సత్సంగములు - జాగరణ - తురీయ బోధ - ఉపనిషత్ విచారణ
·
గురుపౌర్ణమి - మాఘ
పౌర్ణమిలందు శ్రద్ధాళువులకు పారంపర్య ఉపదేశము - క్రమ బోధ గత 12 సం।।లుగా అనేక ప్రాంతములలో జరుగుచున్నది.
·
అద్వైత - అచల
పారంపర్య పీఠములందు ప్రతి సంవత్సరము జరుగు 15 ఆరాధన
కార్యక్రమములకు , తత్వ చింతన సదస్సులకు హాజరగుట -
పారంపర్యబోధనందించుట.
బోధాధికారము గల
శిష్యులు :
1.
సత్యజ్ఞానానంద
స్వరూప శ్రీమతి పడాల అరుణగారు, ఉయ్యూరు
2.
విజ్ఞానస్వరూప్
శ్రీ కోసూరి మురళీకృష్ణ గారు, గుంటూరు
3.
ప్రజ్ఞానాత్మ
స్వరూప శ్రీమతి మేకా విజయ కుమారి గారు, పాగోలు
4.
బ్రహ్మానంద స్వరూప్
శ్రీ చాపరాల గాంథీప్రసాద్ గారు, గుడ్లవల్లేరు
5.
నిర్మలానంద శ్రీమతి
చాపరాల ఇందిర గారు, గుడ్లవల్లేరు
6.
నిస్తులాత్మ స్వరూప
శ్రీమతి దుర్గాలక్ష్మి గారు, గుడ్లవల్లేరు
7.
విమలాత్మ స్వరూప
శ్రీమతి వల్లభనేని సూర్యకుమారి గారు, గుడ్లవల్లేరు
8.
నిరవద్యాత్మ స్వరూప
శ్రీమతి వల్లభనేని హేమలత గారు, గుడ్లవల్లేరు
9.
అనుపమాత్మ స్వరూప
శ్రీమతి పిడుగు సునీత గారు, గుంటూరు
10. శాంతాత్మ స్వరూప శ్రీమతి తులసి గారు, హైదరాబాద్
11. ప్రతిష్టాత్మ స్వరూప్ శ్రీ చినరామ చౌదరి గారు, హైదరాబాద్
12. ప్రసన్నాత్మ స్వరూప శ్రీమతి నిర్మల గారు, హైదరాబాద్
13. సిద్ధాత్మ స్వరూప శ్రీమతి శ్రీదేవి గారు, హైదరాబాద్
14. ప్రసిద్ధాత్మ స్వరూప శ్రీమతి రాణి గారు, హైదరాబాద్
15. ఉత్తమాత్మ స్వరూప శ్రీమతి ప్రమీలారాణి గారు, హైదరాబాద్
16. సహజాత్మ స్వరూప శ్రీమతి వర్ధని గారు, హైదరాబాద్
17. శ్రీమతి విశాలాక్షిగారు, హైదరాబాద్
18. నిర్గుణాత్మ స్వరూప శ్రీమతి నాగమణి వత్సవాయి గారు, వైజాగ్
19. ముక్తాత్మ స్వరూప శ్రీమతి విజయ గారు, వైజాగ్
20. నిర్మలాత్మ స్వరూప శ్రీమతి మాలతి గారు, వైజాగ్
21. ప్రత్యగాత్మ స్వరూప శ్రీమతి సంధ్య గారు, వైజాగ్
22.శ్రీమతి సీతామహాలక్ష్మి గారు, వైజాగ్
23. నిష్కలాత్మ స్వరూప శ్రీమతి లక్ష్మి గారు, వైజాగ్
24.నిరంజనాత్మ స్వరూప శ్రీమతి సీతాదేవి గారు, వైజాగ్
ప్రచురించిన
పుస్తకములు:
1.
సర్వవేదాంత
శిరోభూషణము
2.
హస్తామలకము
3.
శుభకర్ణామృతము
4.
భక్తిచంద్రిక
5.
ఆత్మానాత్మ వివేక
దర్శిని
6.
అనంతోపనిషత్
7.
పరిపూర్ణము
8.
శుద్ధనిర్గుణతత్వ
కందార్ధములు
9.
నిర్గుణాత్మ జ్ఞాన
సంయోగము
10. గురుపాదుకా స్తవము
11. బ్రహ్మజ్ఞానావళీమాల
12. హంసతత్వ కందార్ధములు
13. వివేక చింతామణి
14. వాసుదేవమననము
15. బ్రహ్మవిద్య
16. శివరామదీక్షితీయము
17. గురువు అడుగుజాడలలో
18. కఠోపనిషత్
19. గురుపూజా విధానము
20. ప్రార్ధనా కుసుమాంజలి
21. వేదాంత పదకోశ దీపిక
22.పంచీకరణ
23. వేదాంత పంచ వింశతి
24.తత్వచింతన
25. బోధోపకరణములుగా పలు చిత్ర పటములు
పైనన్నియునూ వలయు
వారికి ఉచితముగనే అందరికీ ఇవ్వడము జరుగుచున్నది.
ఇంకనూ అనేక
ఆశ్రమములకు పై బోధ ఆడియోలను అందరూ శ్రవణము చేసి నేర్చుకొనుటకు వీలుగా పెన్ డ్రైవ్
లోను, సిడి లలోను, ఉచితముగా
ఇచ్చుట జరుగుచున్నది. సామాజిక మాధ్యమములైన యూట్యూబ్ నందు గత 12 సం।।లుగా బోధలనందుబాటలో ఏ లాభాపేక్ష లేకుండా ఉచితముగా అందించుచున్నాము.
ఈ రీతిగా చేయు
కార్యక్రమములకు కేంద్ర స్థానముగా పాగోలు గ్రామము, చల్లపల్లి
మండలము, అవనిగడ్డ నియోజక వర్గము, కృష్ణాజిల్లా
వద్ద గురుస్థానము. కావున అచట కైవల్యాశ్రమ చలాచలబోధోపదేశ మందిరము నిర్మాణమునకై
సంకల్పించితిమి.
·
శివాలయము - సత్సంగ
మందిరమును శివలింగము రూపమున 54 అడుగులు
ఎత్తున నిర్మించతలచితిమి. అంతర్వలయము అష్టభుజి గాను బాహ్యవలయము శివలింగముగాను
మరియు యాగశాల - గోశాల నిర్మాణము, దూరప్రాంతవాసులకు వసతి
సౌకర్యము ఏర్పరుచుటకై సాధకనివాస్ నుకూడా నిర్మించదలచాము. అందరికీ భోజనవసతికై
సామూహిక వంటగదిని
·
నిర్మించదలచితిమి.
·
మందిరాంతర్భాగమున
సద్గురువులు, అవతారులు, దేవతలు
కొలువై ఉండునట్లు 2 - 3 అడుగుల మార్బుల్ మూర్తులను 8 మూలల ప్రతిష్ట చేయబడును. ఈశాన్యమున కైవల్యమూర్తి సదాశివ ప్రతిష్ఠ
చేయబడును.
భవిష్యత్ కార్యాచరణ
ప్రణాళిక :
చేపడుతున్న అంశములు :
1.
ట్రస్ట్ ఏర్పరచుట
2.
స్థలము కొనుగోలు
చేయుట
3.
మందిర నిర్మాణమునకై
డిజైన్ తయారుచేయుట
4.
అంచనాలు తయారు
చేయుట
5.
చలాచలబోధ వెబ్ సైట్
ఏర్పరచుట
6.
చలాచలబోధ రేడియో
7.
గ్రంథ అనువాదము
8.
బ్లాగ్ ల నిర్వహణ
9.
గ్రంథ ముద్రణ
10.
పౌర్ణమి సత్సంగ
నిర్వహణ
11.
బోధాధికారులకు
అవసరమైన శిక్షణ
12.
బోధాధికారులు
ఉపదేశములిచ్చుట
13.
జూమ్ పరోక్ష
మాధ్యమములో బోధించుట
14.
యూట్యూబ్ , స్కైప్, ఫోన్, వాట్సప్
వంటి మాధ్యమములద్వారా బోధలను, గ్రంథాలను, పఠాలను అందరికీ అందుబాటులోకి తెచ్చుట
15.
చతుస్సంధ్యలలో సాధన
16.
ప్రతి ఒక్క సాధకుని
జాగ్రత్తగా గుర్తించి పరిణామ తరగతికి తగిన రీతిగా బోధను అందించుట
17.
గురుపారంపర్య బోధను
పలు ప్రదేశములకు వెళ్ళి శ్రద్ధాళువులకు బోధించుట
18.
ప్రతి రోజూ
ఒక్కరికైనా కొత్త వారికి బోధించుట
19.
బోధాధికారము గలవారు
బోధించిన ఆడియోలను సేకరించుట & యూట్యూబ్
వంటి మాధ్యమములలో ఉంచుట
20.
మందిర నిర్మాణ
క్షేత్ర నిర్మలీకరణ
21.
ప్రతి
మాసశివరాత్రికి రుద్రహోమము చేయుట
22.మహాశివరాత్రికి ప్రదోషకాలమున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము - ప్రసాద
వినియోగము చేయుట
23.
ప్రతిరోజూ ఏక
రుద్రాభిషేకముు
ప్రణాళిక:
1.
రోజూ శ్రీసూక్త
సహిత అర్చన
2.
రోజూ భగవద్గీత
పారాయణ
3.
రోజూ వేదాంతసత్సంగము
4.
అవతార్ మెహెర్ బాబా
మౌనదినము
5.
మెహెర్ జయంతి
హరేమెహెర్ ఏకనామం ధాన్యాభిషేకం
6.
భగవాన్ సత్యసాయి
జయంతి ఏకనామం ధాన్యాభిషేకం
7.
విజయదశమి
షిర్డీసాయి సమాధిఆరాధన ఏకనామం ధాన్యాభిషేకం
8.
మహాశివరాత్రి
ఏకనామం ధాన్యాభిషేకం
9.
శ్రీరామనవమి ఏకనామం
ధాన్యాభిషేకం
పై అంశములను
గమనించి ఈ పవిత్రమైన యజ్ఞంలో సమిధగా మీశక్తిననుసరించి పాల్గొన గలరు.
ధన్యవాదాలు.