శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
|
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ
||
శమీ కమలాపత్రాక్షీం శమీ కంటక ధారిణీం
|
ఆరోహతు శమీం
లక్ష్మిం నృణాం ఆయుష్య వర్థినీం
||
నమో విశ్వాసవృక్షాయ పార్థశాస్త్రాస్త్ర ధారిణే
|
త్వత్త:పత్రం
ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ
||
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది |
పౌరుషే
చాప్రతిద్వంద్వశ్చ ఏనం జహి రావణం ||
అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం
|
దుస్వప్న హారిణీం
ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం
||
నియమావళి
1. పొద్దు పొడవక ముందే నిద్ర లెమ్ము. నిర్ణీత సమయములో ఒకే ఆసనమున కూర్చుని, ప్రార్థన, ధ్యానములను కావింపుము. సూర్యోదయమునకు ముందైనచో మంచిది. పూజ కొరకు ప్రత్యేక స్థలమును, ఆసనమును ఏర్పరచుకొనుము. మానసిక, శారీరక పారిశుధ్యము ప్రత్యేకముగా పాటింపుము.
2. ప్రేమ, భక్తిపూరితమైన హృదయముతో ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదింపుమను ప్రార్థనతో ధ్యానమును ఆరంభింపుము.
3. భగవంతునిలో సంపూర్ణ ఐక్యము పొందుటయే గమ్యముగా నిర్ణయించుకొనుము. లక్ష్యము సాధించునంత వరకును విశ్రమింపకుము.
4. ప్రకృతితో తాదాత్మ్యము చెందునట్లు నిష్కపటముగాను, నిరాడంబరముగాను జీవింపుము.
5. ఎల్లప్పుడు సత్యమునే పలుకుము. కష్టములు నీ మేలుకై భగవంతుడు ఇచ్చిన వరములని తలచి కృతజ్ఞుడవై ఉండుము.
6. అందరినీ నీ సోదరులుగా భావించి, వారిని అట్లే ఆదరింపుము.
7. ఇతరులు చేసిన తప్పులకు ప్రతీకారభావము లేకుండా ఉండుము.
8. నిజాయితీ అయిన ధర్మమైన సంపాదనకు తగిన ప్రాధాన్యతని ఇస్తూ నీకు లభించిన దానిని నిరంతర దైవస్మరణలో తృప్తిగా భుజింపుము.
9. ఇతరులలో ప్రేమ, పవిత్రభావములు జనించునట్లుగా నీ జీవితమును మలచుకొనుము.
10. నిద్ర పోబోవు సమయమున దైవ సన్నిధిని అనుభూతి చెందుతు చేసిన తప్పులకు పశ్చాత్తాపము చెందుము. వినమ్రభావముతో క్షమాపణ వేడుకొని తిరిగి ఆ తప్పులు చేయకుండునట్లు తీర్మానించుకొనుము.
11. నిత్యస్మరణీయులైన దేశికులను సదా మానసికముగా ఆశ్రయించుము.
12. దేహాత్మ - దివ్యాత్మ - పరమాత్మలందు అంతఃస్సాక్షివై అభేదదర్శనమును కలిగి ఉండుము.
13. పరాత్పరమునే - కైవల్యమునే జీవన లక్ష్యముగా స్వీకరించి సర్వసాక్షివై వ్యవహరించుము.
14. గురుపూజ నియమిత కాలమున నిస్సంగత్వమునకై ఆచరింపుము.
15. గురుమంత్ర ధ్యానము - గురుపాదకమలసేవ - గురోరుచ్ఛిష్ఠ భోజనము - పరమగురు - పరమేష్ఠి గురుకరుణ నిత్య జీవనమున ఊతగా కైంకర్యపూర్వకముగా స్వీకరించుము.
16. జీవన్ముక్తిని బడసి జన్మరాహిత్యముకై సర్వభ్రాంతిరహిత ఆవరణరహిత తురీయాతీత కైవల్యాశ్రమమును స్వీకరింపుము.
కైవల్య లక్ష్యసాధనకు తప్పక ఆచరించతగినవని, పై నియమావళి చాలా చక్కగా ఉన్నాయన్నారు స్వామి నిర్భయానంద. ముందు ఆశ్రమ నిర్వాహకులు, బోధాధికారులు, సమన్వయకమిటీలు, సత్సంగసభ్యులు వాటిని ఆచరించి అనుభవించి ఆ అనుభవంతో ఆశ్రమానికి వచ్చినవారికి చెపితే ఆ 16 సూత్రాలయొక్క ప్రయోజనం నెరవేరుతుందన్నారు స్వామి.
వెబ్సైటు కంటెంట్ ఉపయోగించుటకు సిఫారసు చేయబడినవి
# |
ఉపకరణం |
లింకు |
|
|
1 |
ఇంటర్నెట్ బ్రౌసర్ |
|
||
2 |
పుస్తకాలు, పఠములు చూడటానికి |
|
||
3 |
ఆడియోలు, వీడియో లు ప్లే చేయుటకు |
|
||
4 |
PDF పుస్తకాలు, పఠములు చదువుకొనుటకు |
|
||
5 |
చలాచలబోధ వెబ్సైటును మొబైలులో ఒకే క్లిక్
తో చూచుటకు షార్ట్ కట్ ఏర్పాటు చేసుకోవలెను |
|
||
క్రోమ్ బ్రౌసర్ లో అయితే మీరు మొదటి సారి వెబ్సైటు
చూస్తున్నప్పుడు 'Add to Home screen' నొక్కండి. ఆ
తరువాత నుంచి మీ మొబైలు పై చలాచలబోధ అనే ఐకాన్ ను నొక్కుట ద్వారా ఒకే క్లిక్ తో చలాచలబోధ
వెబ్సైటు వస్తుంది. |
|
|||